calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆర్థిక శాస్త్రం

16-04-2025 12:00:00 AM

  1. మనిషి మనుగడ ఆర్థిక శాస్త్రం పైనే ఆధారపడి ఉంది 
  2. పియు కళాశాల ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆర్థిక శాస్త్రమేనని పియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధి లో ముఖ్యభూమిక  అనే అంశంపై పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీలో సెమినార్ హాల్ యందు అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని జాతీయ అర్థశాస దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశాభివృద్ధిలో ఆర్థిక శాస్త్రం ముఖ్య భూమిక వహిస్తుందని, ఎగుమతులను ప్రోత్సహించాలని, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని, స్వదేశీ వస్తువులను కొనడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. భూమి పై జీవిస్తున్న మనిషి మనగడ ఆర్థిక శాస్త్ర పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాఘవేంద్రరావు, అధ్యాపకులు డాక్టర్ జిమ్మీ కార్టన్,  డా శివలింగం, రాజ్ నాయక్ పాల్గొన్నారు.