calender_icon.png 1 February, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సర్వే నివేదిక.. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి చెంపదెబ్బ

01-02-2025 02:01:39 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్.. పాలనచేతగాక గత బీఆర్‌ఎస్ పాలనపై  దుష్ర్పచారాలు చేస్తుందని, కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఆ పార్టీకి చెంపపెట్టు లాంటిదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ న్నారు.

ఆర్థిక సర్వేలో పేర్కొన్న అనేక అంశా ల్లో తెలంగాణ సాధించిన ప్రగతి, ఆర్థిక మైలురాళ్లు పదేండ్ల తమ ప్రభుత్వ పరిపాలనకు తార్కాణమని, తెలంగాణ మోడల్ విజ యవంతం అయిందని చెప్పడానికి సాక్ష్యమన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చెందిన తెలం గాణను అథోపాతాళానికి తీసుకెళ్లకుండా పరిపాలనపై దృష్టి సారించి, ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2024- తెలం గాణ రాష్ర్టం గత దశాబ్దంలో సాధించిన సమగ్ర, సమతుల అభివృద్ధిని మరోసారి ప్రతిబింబించిందన్నారు. ఆర్థిక సర్వే ప్రకా రం, తెలంగాణ సొంత ఆదాయ వనరుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

రాష్ర్టం 88 శాతం ఆదాయాన్ని స్వయంగా సేకరించుకొనే ఆర్థిక వ్యవస్థ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఇది గట్టి సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొత్తం సాగుభూమిలో 90 శాతానికి పైగా సాగునీటి సదుపాయం ఉందన్న విషయాన్ని సర్వే ప్రస్ఫుటించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రాపగండాను తిప్పికొ ట్టిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే ఇది  సాధ్యమైందన్నారు. 2017 లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించిన వీ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలోనే 100 శాతం తాగునీటిని సరఫరా చేసిన తొలి రాష్ట్రంగా నిలిచిందన్నారు.