calender_icon.png 16 March, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆర్థిక స్వావలంబన..

08-03-2025 11:00:28 PM

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ..

ముషీరాబాద్ (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ అన్నారు. ఈ మేరకు శనివారం భోలక్‌పూర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన ముఠా జై సింహ మాట్లాడుతూ... మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నాయని, దాడులను వెంటనే అరికట్టాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్‌పూర్ గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు బైరు గంగ, జనరల్ సెక్రెటరీ కట్ట కవిత, ట్రెజరర్, బైరు నీరజ, బైరు విజయలక్ష్మి, సంఘంలో సీనియర్ మహిళ నాయకురాలు ఎల్లమ్మ, మహిళలందరికీ.. ఉమెన్స్ డే సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంగం అధ్యక్షుడు కేఎం శంకర్, భోలక్‌పూర్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.