calender_icon.png 11 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ హయాంలోనే ఆర్థిక సంస్కరణలు

31-12-2024 02:57:02 AM

  • కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్ట్స్ అన్నది ఆయనే.. 

అసెంబ్లీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): భారతదేశ ఆర్థిక గతినే మార్చిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశమై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ..1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.

నాడు తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు విదేశీ పెట్టుబడులతో దేశ ఆర్థికస్థితి గాడిన పడిందని తెలిపారు. సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఉపాధి హామీ పథకాలు ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. మన్మోహన్‌సింగ్ నిఖార్సైన రాజనీతిజ్ఞుడని, కంట్రీ ఫస్ట్..పార్టీ నెక్స్ అన్నారని గుర్తు చేశారు. ప్రధానిగా పదేళ్లు దేశానికి ఎన్నో సేవలందించారని కొనియాడారు. దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల ను ఎదుర్కొన్నప్పుడు ఆయన మౌ నంగా సమాధానం చెప్పేవారన్నారు.