calender_icon.png 10 January, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యూ3లో ఎకానమీ రికవరీ

25-12-2024 12:23:02 AM

* ఆర్బీఐ బులెటిన్

ముంబై, డిసెంబర్ 24: ఈ ఆర్థిక సంవత్స రం జూలై త్రైమాసికంలో మందగించిన ఆర్థిక వ్యవస్థ క్యూ3లో (అక్టోబర్ రికవరీ అవుతున్నదని రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. పటిష్టమైన పండుగ సీజన్ యాక్వివిటీకి తోడు గ్రామీణ డిమాండ్ పెరగడంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని పేర్కొంది. గ్లోబల్ ఎకానమీ స్థిర వృద్ధిని కనపర్చడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం సానుకూల అంశాలని తెలిపింది.

వ్యవసాయ రంగం మెరుగుదల తో గ్రామీణ వినియోగం జోరుగా పెరిగింద ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం బులెటిన్‌లో వివరించింది. ఈ ఏడాది జూలై భారత్ జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్టస్థాయి 5.4 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.