calender_icon.png 17 March, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలతోనే కుటుంబాల ఆర్థిక పురోగతి

17-03-2025 01:11:27 AM

  • మహిళలు లేకుంటే ప్రపంచమే శూన్యం 
  • వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్

ముషీరాబాద్, మార్చి 16: (విజయక్రాం తి): మహిళల ద్వారానే కుటుంబాల ఆర్థిక  పురోగతి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర అన్నారు. మహిళలు లేకుంటే ప్రపంచమే శూన్యం అని  పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్ లింగంపల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో   తెలంగాణ రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ  మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై  ఆయన మాట్లాడుతూ మహిళల ద్వారానే కుటుంబాల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. కర్ణాటకలోని బసవేశ్వర స్వామి మహరాజ్ కూడా పేదరికంలో జన్మించి, సంఘం, సమాజంలో ఆనాడు జరుగుతున్న మార్పులకు మహిళలకు  ఎంతో ప్రాముఖ్యత తెలియచెప్పారని గుర్తు చేశారు. నేటి సమాజంలో కూడా మహిళలు  అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశ, రాష్ట్ర పురోగ అభివృద్ధి సాధిస్తుందన్నారు.

కేంద్ర  ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఉద్యోగ, రాజకీయాలలో ముందంజలో  ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకురాలు ఇందిరా శోభన్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సం ఘం మహిళా  అధ్యక్షురాలు సూర్య శ్రావణి మాశెట్టి, నాయకులు రాచప్ప, దినేష్ పాటి ల్, తదితరులు  పాల్గొన్నారు.