calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అభ్యుదయం మన చేతుల్లోనే!

02-04-2025 12:00:00 AM

సహజంగానే ఎక్కువమంది పని చేస్తే ఆదాయం పెరుగుతుంది. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. దీనికి వ్యతిరిక్తంగా ఉన్న దేశంలో అవి అధమంగా ఉంటాయి. పౌరులలో తగ్గిన సంతానోత్పత్తి సామర్థ్యం, మరణాల సంఖ్య అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

పరస్పర సాధకాహి 

శక్తిదేశ కాలాః..

కౌటిలీయం: (9.1) శక్తి దేశకాలాలు అన్యోన్య ఉపకారకాలు గా ఉంటాయంటారు ఆచార్య చాణక్య. శక్తి అంటే ఆర్థిక, సామాజిక, సాంకేతిక ప్రగతి, మౌలిక వసతుల కల్పనయే. పౌరులకు ఉన్నత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, వనరులు అందుబాటులో ఉంటే సంపద సృష్టి జరుగుతుంది. దాంతో దేశం సుభిక్షమవుతుంది. సమగ్రాభివృద్ధిని సాధిస్తుం ది.

ఏ దేశంలోనైనా పని చేయగలిగిన జనాభా (15 సంవత్సరాల వయసు వారు) అధికంగా ఉండి వారిపై ఆధార పడిన జనాభా తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతుంది. వారు ప్రభుత్వానికి పన్నులు కట్టడం, కనీస అవసరాలకు పోను మిగులును పెట్టుబడులుగా పెడతారు. దీనివల్ల ప్రభుత్వాలకు ఆదాయం సమకూరి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన సులువవుతుంది. 

ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయి. దానినే జనాభా డివిడెండ్ (లాభాంశం) అంటారు. దానివల్ల ఉత్పాదకతలు పెరిగి ఆర్థిక ప్రగతితో అభివృద్ధి చెందిన దేశంగా పరిణామం చెందుతుంది. ఇందుకు విలోమంగా పని చేయగలిగిన జనభా తక్కువగా ఉండి, వారిపై ఆధారపడే వాళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని నైట్మేర్ (పీడకల)గా చెబుతారు.

సహజంగానే ఎక్కువమంది పని చేస్తే ఆదాయం పెరుగుతుంది. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. దీనికి వ్యతిరిక్తంగా ఉన్న దేశంలో అవి అధమంగా ఉంటాయి. పౌరులలో తగ్గిన సంతానోత్పత్తి  సామ ర్థ్యం, మరణాల సంఖ్య అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న దేశం లో ఆరోగ్య, ఆహార, నిర్వహణా సమస్యలు అధికంగా ఉంటాయి. స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి, జనాభా తగ్గడం వల్ల ఉత్పత్తి  ఉత్పాదకతలు తగ్గిపోయి, ప్రభుత్వ ఖజానాకు రాబడి సన్నగిల్లుతుంది. పని చేయ గలిగిన యువత అధికంగా ఉన్నా వారిలో అవసరమైన నైపుణ్యాలు లేకుండా వారం తా ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడినా నష్టమే.

ఇటువంటి వేళ కూడా ప్రభుత్వ ఆదాయం తగ్గి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, వసతులు, ఉద్యోగాల కల్పన క్లిష్టతరమవుతుంది. దాంతో ఆయా రంగాలలో పోటీ అధికమై, సామాజిక వైరుధ్యం ఏర్పడి శాంతిభద్రతల సమస్య లు మొదలవుతాయి. ఉపాధికై యువత ఇతర దేశాలకు వలసపోవడం, వృద్ధులు మాత్రమే దేశంలో ఉండిపోవడం వల్ల వారిని పోషించడం ప్రభుత్వాలకు భారమవుతుంది.

ఇతర దేశాలకు వలసలు వెళ్ళిన ఉద్యోగులు ఏ కారణం చేతనైనా తిరిగి వచ్చిన సమయంలో వారికీ ఉపాధినీ కల్పించడం ప్రభుత్వానికి సమస్యగా మారుతుంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించి, ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. (విదేశాల్లో పని చేస్తున్న వారిలో 60 నుంచి 80 శాతం మంది రిటైర్మెంట్ తదుపరి భారతదేశానికి రావాలని భావిస్తున్నారట.) ఇటువంటి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి.

బాధ్యతాయుత ప్రజలవల్లే.. 

జనాభా డివిడెండ్ లాభాలను సరిగా గుర్తించి సమర్థవంతంగా వినియోగించుకొని లాభపడిన దేశాలు కూడా కాలా వధిలో అత్యల్ప లేదా అత్యధిక జనాభా వల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం లాంటివి కల్పించడంలో విఫలమవుతాయి. అప్పు డు జనాభా నైట్మేర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. జనాభా తక్కువగా ఉన్న దేశా లు సాంకేతికంగా ఎదగ లేకపోతే, పరదేశాల పౌరులను ఆకర్షణీయ వేతనాలపై ఆహ్వానించి ఉత్పత్తి  ఉత్పాదకతలను పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు.

కానీ అలా వచ్చిన వారు ఏ కారణంతోనైనా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. అప్పు డూ ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిపోతుం ది. ఫలితంగా ఆర్థికంగా స్తబ్దత ఏర్పడుతుంది. దీనివల్ల నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, వనరుల వినియోగంలో పోటీతత్వం పెరుగుతాయి. తద్వారా సామాజిక అలజడులు, అశాంతి పలకరిస్తాయి.

విద్య, వైద్యం, సామాజిక వసతుల కల్పనలకు డిమాండ్ ఏర్పడి, వాటిని కల్పించలేని ప్రభుత్వంపై అసమ్మతి పెరిగిపోతుంది. ఈ పరిస్థితులను సరిచేసేం దుకు అధిక సంతానాన్ని ప్రోత్సహించడం, ఉత్తమ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని ఆదరించడం, అభివృద్ధి సంక్షేమాలను రెండింటినీ సమన్వయం చేస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫలితాలను సాధించడం కర్తవ్యాలుగా ప్రభు త్వాలు పనిచేయాలి.

అప్పుడు ప్రయోజ నం సిద్ధిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనలు, అవసరమైన శిక్షణలు ప్రాధాన్యతాంశాలుగా ప్రభుత్వం పనిచేయాలి. ప్రజ లను బాధ్యతతో పని చేయించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఆవిష్కారమవుతాయి.

ఈ నేపథ్యంలో భారతదేశ పరిస్థితిని  పరిశీలిస్తే, దేశ జనాభాలో దాదాపు 62 శాతం మంది పని చేయగలిగిన వయసు లో ఉన్నారు. దీనివల్ల అద్భుత ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఇది చైనా, అమెరికా, యూరప్ దేశాలకన్నా అధికమైంది. అయినా, ఆశించిన ఫలితాలు సాధించలేక పోవడానికి కారణాలు ఏమిటి? మరణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పనిచేసే వారిపై ఆధార పడిన వారి సంఖ్య అధికంగా ఉండడం,

ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోవడం, సోమరితనం, ఇంకా నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు సామా న్యులకు అందుబాటులో లేకపోవడం, ఉపాధిపై దృష్టి పెట్టిన యువత సంతానోత్పత్తిని పట్టించుకోకపోవడం, ప్రతిభను దూరం పెట్టడం, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం, నాణ్యత, నైపుణ్యాలు లేని యువత ప్రపంచ మార్కెట్‌లో అవకాశాలను అందుకోవడంలో విఫలమవడం, (మానవ వనరుల అభివృద్ధి సూచికలో 134వ స్థానం) పౌష్టికాహారలోపం.. ఇలాం టి కారణాలు ఎన్నో ఉన్నాయి.

వీటివల్ల జనాభా డివిడెండ్‌గా మారవలసిన భారతదేశం జనాభా నైట్మేర్‌గా మారుతుందని నిపుణులు చెపుతున్నారు. ఈ రంగాలపై దృష్టిని కేంద్రీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయగలగాలి. అప్పుడు భార తదేశం అత్యద్భుత ఆర్థిక అభ్యుదయాన్ని సాధించి శక్తివంతమైన దేశంగా పరిణామం చెందుతుందనడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు.