- భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో ఐఐటీ హైదరాబాద్ పాత్ర కీలకం
- కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
సంగారెడ్డి, జనవరి 31(విజయ క్రాంతి) : దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల పాత్ర కీలక మని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని కందిలోని ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.
ఐఐటి హైదరాబాద్లో చేస్తున్న పరిశోధనలతో ఆధునిక సాంకేతికత లభిస్తుందన్నారు. ఆటోమేషన్, ఇంటెలిజెన్సీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఐఐటీ చేస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో మంచి మేలు చేస్తాయన్నారు. ఆధునిక సాంకే తికత వినియోగంతో దేశ ఆర్థికాభివృద్ధి ముందుకు పోతుం దన్నారు.
విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రభు త్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఐటి హైదరా బాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి, అదనపు ఎస్పి సంజీవరావు, ఆర్డీవో రవీందర్ రెడ్డి, డిఎస్పి సత్తయ్యగౌడ్, కంది తాసిల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ మల్లయ్య ఉన్నారు.