calender_icon.png 1 February, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం

01-02-2025 01:47:57 AM

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): తెలంగాణ ధనిక రా ష్ట్రంగా ఏర్పడినప్పటికీ, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమై, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, దుబారా ఖర్చులు, రాజకీయ నియామకాలు, కోట్లాది రూపాయల ప్రజాసొమ్ముతో ప్రకటనల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశా రు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని.. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికీ తీసుకెళ్తామని ఎన్వీఎస్‌ఎస్ తెలిపారు.