- కుటుంబ వివరాలతోపాటు విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, వృత్తి, స్థిర, చర ఆస్తుల నమోదు
- పాడి సంపద వివరాలూ చెప్పాల్సిందే
- పూర్తి వివరాలతో ఫార్మాట్ తయారు చేసిన సర్కార్
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన కోసం ప్రణాళిక శాఖ ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసింది. ఎనిమిది పేజీలు.. 56 అంశాలతో కూడిన ఫార్మాట్‌లో కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలను సేక రించాలని నిర్ణయించింది.
అయితే ఒకటి, రెండు పేరాల్లో కుటుంబ వివరాలు ఉండగా, మిగతా 54 అంశాలు పూర్తిగా ఆర్థిక, రాజకీ య, విద్యకు సంబంధించిన అంశాలు సేకరించడానికే కేటాయించారు. దీంతో ప్రభు త్వం తయారు చేసిన ఫార్మాట్‌పై సొంత పా ర్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కులగణనకు కుటుంబసభ్యులు ఎంద రు? వారి కులం తీసుకుంటే సరిపోతుందని, మిగతా ఆర్థిక అంశాల జోలికి వెళ్ల డం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్ట్-1 : క్రమ సంఖ్య, కుటుంబ యజమాని- సభ్యుల పేర్లు, యజమానితో సంబ ంధం, జెండర్, మతం, కులం లేదా సామాజిక వర్గం, ఉప కులం పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నెంబర్
పార్ట్-2: ఎన్నికల గుర్తింపు కార్డు, ది వ్యాంగులైతే వైకల్యరకం, వైవాహక స్థితి, వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల లోపు పాఠశాలలో చేరారా లేదా? స్కూల్ రకం, విద్యార్హతలు, 6-16 ఏళ్ల మధ్య వయసువారు బడి మానేస్తే ఆ సమయానికి చదవు తున్న తరగతి, వయసు, బడి మానేయడానికి గల కారణాలు, 17-40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే చదవుకోపోవడానికి గల కారణాలు.
పార్ట్-3: ప్రస్తుతం ఏదైనా పని చేస్తున్నా రా? స్వయం ఉపాధి అయితే వివరాలు, రోజువారి వేతన జీవులైతే ఏ రంగంలో పని చేస్తున్నారు, కుల వృత్తి, ప్రస్తుతం కులవృత్తి లో కొనసాగుతున్నారా? కులవృత్తి కారణం గా ఏమైనా వ్యాధులు సంక్రమించాయా? వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపు దారులా? బ్యాంకు ఖాతా ఉందా లేదా?
పార్ట్-4 : రిజర్వేషన్ వల్ల పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వారైతే కుల ధ్రువీకరణ పత్రం పొందారా? సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా? రాజకీయ నేపథ్యం? ప్రజాప్రతినిధిగా ఉంటే పదవి ఏమిటి? ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. నామినేటెడ్ లేదా కార్పొరేషన్ లేదా ప్రభుత్వ సంస్థలు వేటిలోనైనా సభ్యులా?
పార్ట్-5: ధరణి పాస్‌బుక్ ఉందా? ఉంటే పాస్‌బుక్ నంబర్, భూమి రకం. భూమి విస్తీ ర్ణం? వారసత్వమా? కొనుగోలు చేసిందా? బహుమతా? అసైన్డ్ భూమా? అటవీ హక్కు ల ద్వారా పొందినదా? ప్రధాన నీటి వనరు, పండే పంటలు, ఏమైనా రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం తీసుకున్నా రు. ఎక్కడి నంచి రుణాలు తీసుకున్నారు. వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తారా? కుటుంబానికి చెందిన పశు సంపద (ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, కోళ్లు, బాతులు, పందులు) వివరాలు .
పార్ట్-6: కుటుంబ స్థిరాస్తుల వివరాలు- ఆస్తుల సంఖ్య, చరాస్తుల వివరాలు-ఆస్తుల సంఖ్య, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, స్వభావం. మరుగుదొడ్డి ఉందా లేదా?, ఉంటే వాడుతున్నారా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా? అనే ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు.
ఈ సమాచారం వాస్తవమేనని ప్రకటిస్తున్నానంటూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్యూమరేటర్, సూపర్‌వైజర్ కూడా సంతకాలు చేసి, తేదీని నమోదు చేస్తారు.