calender_icon.png 30 November, 2024 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోడైవర్సిటీతో పర్యావరణ సమతుల్యత

30-11-2024 12:19:36 AM

  1. మేయర్ గద్వాల విజయలక్ష్మి
  2. జాతీయ బయోడైవర్సిటీ సదస్సులో ప్రసంగం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రపచం ఆర్థిక వ్యవస్థలో 80 శాతానికి పైగా వాటా కలిగిన నగరాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు జీవ వైవిధ్యం పాత్ర అత్యంత కీలకమైందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నా రు.

జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరామెంటల్ ఇనిషియేటివ్స్ (ఐసీఎల్‌ఈఐ) సౌత్ ఏషియా సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట హోటల్ తాజ్ వివంతలో అర్బన్ బయోడైవర్సిటీపై రెండ్రోజుల జాతీయ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అర్బన్ బయోడైవర్సిటీ పరిరక్షణలో హైదరాబాద్ నగరం గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలోని అర్బ న్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో పచ్చని ప్రదేశాలను పెంచడం, సహ జ ఆవాసాలను పరిరక్షించడం, బయో కారిడార్ల ఏర్పాటు, జలాశయా ల పరిరక్షణ చర్య లు చేపట్టినట్టు తెలిపారు.

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఐసీఎల్‌ఈఐ వంటి సంస్థల భాగస్వామ్యంతో పర్యావరణ సమతుల్యతను సాధించడంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ చైర్‌పర్సన్ సి.అచలేందర్ రెడ్డి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లుమైట్ చేంజ్ అడ్వైజర్ రఘు కుమార్ కొడాలి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ సెక్రటరీ డాక్టర్ బి.బాలాజీ, డాక్టర్ భిక్షంగుజ్జ, డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, హరీశ్ చంద్రప్రసాద్ యార్లగడ్డ, ఐసీఎల్‌ఈఐ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ మోనాలిన సేన్, డాక్టర్ సాయిరాం రెడ్డి, సంజీవ్, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.