calender_icon.png 23 December, 2024 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్ ఆసుపత్రికి వీడని గ్రహణం

03-08-2024 02:53:10 AM

  1. ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభం 
  2. సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం 
  3. ప్రభుత్వ వైద్యానికి దూరమవుతున్న పేదలు

గద్వాల(వనపర్తి), ఆగస్టు 2 (విజయక్రాంతి): అలంపూర్ నియోజకవర్గ కేంద్రం లోని చౌరస్తాలో తాజా మాజీ ఎమ్మెల్యే అబ్రహం వంద పడకల ఆసుపత్రిని తీసుకుని వచ్చి నిర్మాణం చేయించారు. దీంతో ప్రభుత్వ వైద్యం అందుతుందని నియోజకవర్గ ప్రజలు సంతోషపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రారంభించారు. కానీ అందులో కనీస సదుపాయాలు కల్పించకుండానే ప్రారంభించడంతో పేదలు ఉచిత వైద్యానికి దూరమవుతున్నారు. 

ఎన్నికల ప్రచారం కోసమేనా?

2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆసుపత్రిని హడావిడిగా ప్రారంభించిం ది. కానీ ఎలాంటి వసతులు కల్పించలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హ, జిల్లా అధికారులతో కలిసి వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. మూడు నెలల్లోనే సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆసుపత్రి వైపు చూసింది లేదు. 

సీఎం దృష్టికి తీసుకెళ్లాం

అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులను, సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. ప్రజల పక్షాన వినతిపత్రాన్ని కూడా ఇచ్చాము. త్వరలోనే పూర్తి స్థాయిలో సౌకర్యాలను కల్పించి, అందుబాటులోకి తెచ్చే విధం గా కృషి చేస్తాను.

 విజేయుడు, ఎమ్మెల్యే, అలంపూర్