కాప్రా (విజయక్రాంతి): ఈసీఐఎల్ లోని నారాయణ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. బుధవారం నారాయణ కళాశాల స్పోర్ట్స్ మీట్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను కళాశాల జిఎంకే శ్రీనివాస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులకు క్రీడలు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయన్నారు. ఇక క్రీడా పోటీలు విద్యార్థులకు ఆటవిడుపుగా ఉంటాయన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించేందుకు పండుగలు, వాటి విశిష్టత తదితర అంశాలపై నారాయణ కళాశాల యాజమాన్యం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సైతం క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరుచుతున్నారని వెల్లడించారు. క్రీడా పోటీలు అనంతరం పోటీల్లోని విజేతలకు బహుమతులను ప్రధానం చేసి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ వేణు కుమార్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.