calender_icon.png 19 April, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్ ‘లెస్’ సెంటర్!

19-04-2025 01:42:39 AM

సమయపాలన లేదు.. అవసరమైన మందులు ఆర్డర్‌లోనే 

కొన్ని నెలలుగా పనిచేయని ఈసీజీ మిషన్ 

అత్యధిక సమయం ఫోన్లలోనే గడుపుతున్న వెల్ నెస్ సెంటర్ సిబ్బంది 

లోకల్ అనస్తిసియా లేర... సర్జికల్ కాటనే లేదు

పట్టించుకోని అధికార యంత్రాంగం 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందు బాటులో ఉంచాలని సంకల్పంతో ప్రభుత్వం వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలోని కూడా వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని ఉన్న వెల్ నెస్ సెంటర్ నిర్వాహన అగమ్య గోచరంగా మారింది. పాత డీఎంహెచ్‌ఓ ఆఫీస్ కార్యాలయంలో మొదటి అంతస్తులు ఏర్పాటు చేసినప్పటికీ వెల్ న ెస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తీరు తీరక విధంగా ఉంది. పెన్షనర్లు అత్యధికంగా వెల్నెస్ సెంటర్‌ను సంప్రదిస్తున్న ప్పటికీ ఆశించిన మేరకు వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నత అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వెల్నెస్ సెంటర్ నిర్వాణ సిబ్బంది వారి ఇష్టనుసారంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

సర్జికల్ కాటనే లేదు... లోకల్ అనస్తీసియా లేరు

వివిధ రోగాలకు వైద్య సేవలు అందించాలని సంకల్పంతో ఆవిష్కృతం చేసిన వెల్ నెస్ సెంటర్ లో డెంటల్ వైద్య సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాగా ఆశించిన మేరకు వైద్య సేవలు మాత్రం లభించవు. సంబంధిత డాక్టర్ ఉన్నప్పటికీ లోకల్ అనస్తీసియా లేరు, కనీసం సర్జికల్ కాటన్ కూడా లేదు.. ఇవేవీ లేకుండా డెంటల్ వైద్య సేవలు కూడా వెల్ నెస్ సెంటర్ ను సంప్రదిస్తున్న వారిని తిరిగి జిల్లా జనరల్ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇలా నిర్వహణ ఉండడం ద్వారా వెల్ నెస్ సెంటర్ ఉందంటే ఉంది అనే విధంగా రోజురోజుకు తయారవుతుంది. 

నెలలు గడుస్తున్న పనిచేయని ఈసీజీ

రోజులు కాదు నెలలు గడుస్తున్న కూడా ఇక్కడ ఉన్న ఈసీజీ మిషన్ పనిచేయదు. ఎందుకు అంటే మెయిల్ పెట్టాం ....టెక్నీషియన్ రాలేదు.. త్వరలోనే పూర్తి చేస్తాం.. అవసరమైన వైద్య సేవలు అందిస్తాం ఇది నిత్యం చెబుతున్న మాట... కాగా దాదాపు నాలుగు నెలలు పైగా కావస్తున్న ఈసీజీ మిషన్ పనిచేయడం లేదని వెల్ నెస్ సెంటర్ కు వస్తున్న రోగులు సైతం ఆసానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు డాక్టర్లు అయితే ఎలాగో వైద్య సేవలు అందించేందుకు సరైన సదుపాయాలు లేవు.. చూసేదేముంది ఆస్పత్రికి వచ్చామా..? అటెండెన్స్ వేసామా..? డోర్లు మూసుకొని ఫోన్లో సంభాషిస్తూ కేవలం కాలక్షేపం చేసి కొందరు వెనుతిరుగుతున్నారు. మరికొందరైతే ఉదయం వచ్చి అటెండెన్స్ వేసి.. మళ్లీ సాయంత్రం వచ్చి అటెండెన్స్ వేసి తిరిగి ఇంటికి వెళుతున్నారని ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఉన్నత అధికారుల పర్యవేక్షణ వెల్ నెస్ సెంటర్ పై లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేసిందే పని చెప్పిందే మాట అనే విధంగా మారుతుందని పలువురు రోగులు చెబుతున్నారు. 

మొదటి అంతస్తు కష్టమే...

అత్యధికంగా వెల్ నెస్ సెంటర్ కు పెన్షనర్లు వస్తున్నారు. వీరికి ఈ సెంటర్ మొదటి అంతస్తులో ఉండడంతో మోకాళ్ళ నొప్పులు తో పాటు వివిధ తీవ్ర అనారోగ్యాలతో వస్తున్న వారికి మొదటి అంతస్తు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా ఆస్పత్రిని ఇతర ప్రాంతానికి మార్చాలని వారు అక్కడ ఉన్న ఇన్చార్జిని మొరపెట్టుకుంటున్న ఆ దిశగా అడుగులు పడడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమీకృత అధికారుల కార్యాలయం ఏర్పాటు అయిన తర్వాత పట్టణంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నప్పటికీ మొదటి అంతస్తులో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుందని పెన్షనర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నారు. 

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం...

వెల్ నెస్ సెంటర్ నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈసీజీ మిషన్ బాగు చేసేందుకు ఉన్నత అధికారులకు మెయిల్ పెట్టడం జరిగింది. సర్జికల్ కాటన్, లోకల్ అనస్తీషియా డాక్టర్ అవసరం ఉందని కూడా ఉన్నత అధికారులకు నివేదిక అందించాం. మందులను కూడా అయిపోయిన వెంటనే ఆర్డర్ పెడుతున్నాం. నిబంధ నలకు లోబడి పని చేస్తున్నాం. సిబ్బంది విధులు అందరూ సక్రమంగా నిర్వహిస్తున్నా రు. మొదటి అంతస్తులు పెన్షనర్లు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. ఈ విషయా న్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. అందరికీ అవసరమైన వైద్య సదు పాయాలు అందుబాటులో ఉంచుతున్నాం 

 -వివేకానంద, వెల్ నెస్ సెంటర్ ఇన్చార్జ్, మహబూబ్ నగర్