calender_icon.png 2 November, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంద్యాల ఎస్పీపై చర్యలకు ఈసీ ఆదేశం

12-05-2024 03:38:10 PM

ఆంధ్రప్రదేశ్:   లోక్ సభ ఎన్నికల వేళ నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రఘువీరా రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని తెలిపింది. శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది.