calender_icon.png 17 November, 2024 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమిత్ షా, రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు

17-11-2024 12:46:09 AM

ముంబై, నవంబర్ 16: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి  శనివారం ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీచేసింది. మహారాష్ట్ర ఎన్నిలకు సంబంధించి ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ స్పష్టం చేసింది.  నవంబర్ 6న ముంబై లో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర నుంచి అవకాశాలను. పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టారు’ అని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంత రం వ్యక్తం చేసిన  బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాహుల్ తన ప్రసంగాలతో మహారాష్ట్ర యువతను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలాం టి వ్యాఖ్యలు జాతి ఐక్యత, సమగ్రతకు ప్రమాదకరం అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే షా మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో .. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశంలో తీవ్రవాదాన్ని పోత్సహిస్తున్నాయని, అలాగే కాంగ్రెస్ రిజర్వేషన్లను తొలగించాలని యోచిస్తోందని ఆరోపించారు.