calender_icon.png 8 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది

07-01-2025 05:05:27 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(Election Commission of India) మంగళవారం ప్రకటించింది. దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించి, 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్(Chief Election Commissioner Rajiv Kumar) పేర్కొన్నారు. 70 మంది శాసనసభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 10న నోటీఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

నామినేషన్ల సమర్పణకు జనవరి 17ను చివరి తేదీగా ప్రకటించి, 18న నామినేషన్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 20న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 5న పోలీంగ్, 08న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించింది.  ఢిల్లీలో సవరించిన కొత్త ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలకు 13,033 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ తెలిపారు.

అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అందుబాటులో ఉంటుందని, 85 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్నికల్పిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాపై ప్రతిపక్షల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఓటింగ్ లో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. దేశంలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని, త్వరలోనే ఓటర్ల సంఖ్య 100 కోట్లు దాటనుందన్నారు.  ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పుల ఇచ్చాయని సీఈసీ ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.