calender_icon.png 6 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర డీజీపీపై ఈసీ వేటు

05-11-2024 12:51:42 AM

  1. రష్మీ శుక్లా బదిలీ
  2. తాత్కాలిక డీజీపీగా ముంబై సీపీ?

ముంబై, నవంబర్ 4: మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. తమ పట్ల డీజీపీ రష్మీ తీవ్ర పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపిస్తూ మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీలు సీఈసీకి ఫిర్యాదు చేశాయి.

గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేరవేశారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆమెను ‘బీజేపీ డీజీపీ’గా అభివర్ణించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పొలిటికల్ హింస పెరిగిందని,  లా అండ్ ఆర్డర్ క్షీణించిందని ఎంవీఏ ఆరోపించింది.

ఆమె సారథ్యంలో పోలీసులు పనిచేస్తే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగవని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రష్మీని డీజీపీ పదవి నుంచి తొలగించి వేరొకరని నియమించాలని కోరాయి. దీంతో ఈసీ స్పందించి డీజీపీని బదిలీ చేసింది. అధికారులు ఎన్నికల్లో న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.

రష్మీ స్థానంలో సీనియర్ ఐపీఎస్‌కు డీజీపీ బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ముంబై సీపీగా పనిచేస్తున్న వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలకి డీజీపీగా బాధ్యతులు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో ఈ నెల 20న ఓటింగ్ జరగనుంది.