calender_icon.png 11 January, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చియా సీడ్స్ తింటున్నారా!

25-06-2024 12:05:00 AM

చియా సీడ్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పచ్చి చియా సీడ్స్ నేరుగా ఎప్పుడూ తినకూడదు. చియా సీడ్స్ తినడానికి ముందు నీటిలో నానబెట్టుకొని తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్‌లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం..

  1. చియా సీడ్స్‌లో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
  2. చియా సీడ్స్‌లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.
  3. ఈ గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి.
  4. నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల అందులోని పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా చియా ఈ విధంగా తింటే త్వరగా జీర్ణమవుతాయి.