ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స
జయశంకర్ భూపాలపల్లి(జనగామ), డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఆముదం కా సిన కాయలు తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అం దించడంతో కోలుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవ రణలో కొన్నాళ్ల క్రితం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆముదం మొక్కలను నాటారు. ప్ర స్తుతం అవి ఏపుగా పెరిగి కాయలు కాశా యి.
సోమవారం ఆ కాయలను గమనించిన ఓ విద్యార్థిని వాటిని తెంపుకుని రుచి తీసిం ది. నచ్చడంతో తోటి స్నేహితులకు చెప్పింది. ఎనిమిది మంది విద్యార్థులు పాడి వైష్ణవి, రామినేని హర్షిత్, చంద్రగిరి రుత్విక్, బీసుల శ్రీవర్షిణి, రామినేని హర్ష, పిట్టల వర్షన్, రామినేని వినయశ్రీ, పెద్ది మహాద్విత కాయలను తెంపుకుని తిన్నారు. అనంతరం తరగ తిలో అవస్థతకు గురికావడాన్ని ఉపాధ్యాయురాలు గమనించారు. హుటాహుటిన మహాముత్తారం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భూ పాలపల్లి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.