15-04-2025 07:34:20 PM
సూపర్ వైజర్ జ్యోతి..
మంచిర్యాల (విజయక్రాంతి): చిన్నారుల ఎదుగుదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇవ్వాలని అంగన్వాడి సూపర్వైజర్ కోరారు. పోషణ పక్షోత్సవాలలో భాగంగా పట్టణంలోని అరకలవాడ-2 అంగన్వాడి కేంద్రంలో పిల్లల ఎదుగుదల గురించి అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారం గురించి, పోషక విలువల గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ ఎల్ జ్యోతి, ఏఎన్ఎం సరిత, ఐకెపి ఆర్పీలు సునీత, స్వాతి, అంగన్ వాడి టీచర్ పి సురేఖ, ఏఎల్ఎంఎస్ కమిటీ సభ్యులు నాగమణి, రజిత, విజయ, నాయకురాలు గౌరీ, గర్భిణీలు తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.