12-04-2025 12:00:00 AM
బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రైడ్2’. రాజ్‌కుమార్ గుప్తా దీన్ని క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. వాణీ కపూర్ కథానాయికగా, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ సినిమాలో తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. తాజాగా చిత్రబృందం ఈ పాటను విడుదల చేసింది.
‘నషా..’ అనే ఈ పాటలో తమన్నా తన హుషారైన స్టెప్పులతో యువతను ఉర్రూతలూగిస్తోంది. ‘నషా జే తు కర్నా ఏ తే మేరా కర్నా సోనియా..’ అంటూ సాగుతున్న ఈ పాటలో ‘నేను తాగి ఉన్నా.. మీరూ బాగా మత్తులో ఉన్నారు.. మీరు నా నిద్ర చెడగొట్టారు.. నేనిప్పుడు మీ చేతికి చిక్కాను.. రండి, నేను పూర్తిగా మీదాన్నే.. మద్యం వదిలేయండి.. మీ చూపుల్తో నన్ను తినేయండి.. ఓ ప్రియతమా పగటిపూట నాకు చుక్కలు చూపించు..’ వంటి పంక్తులు యువతను ఆకర్షిస్తున్నాయి.