calender_icon.png 13 April, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులభంగా, వేగంగా భూభారతి!

13-04-2025 01:06:03 AM

  1. పైలట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాలు 
  2. ప్రజల సలహాలు, సూచనలతో పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి 
  3. అధికారులతో సమీక్షలో 
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు 
  5. రేపు భూభారతి ప్రారంభోత్సవం 

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం, లావాదే వీలకు సంబంధించిన సమాచారం రైతుల కు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుం దని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి తెలిపారు. భూభారతిని ఈనెల 14న ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం తన నివాసంలో శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భం గా పలు అంశాలను ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభో త్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

అనంతరం రాష్ర్టంలోని ప్రతీ మండ లంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి  అధికారులకు సూచించారు. వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలన్నారు.

సమీక్షలో రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్ తదితరులు పాల్గొన్నారు.