కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఏస్ షట్లర్ల మ్యాచ్‌లకు సంబంధించిన డ్రాలు విడుదలయ్యాయి. రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన తెలుగు తేజం పీవీ సింధుతో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్‌కు సులువైన డ్రా ఎదురుకాగా.. లక్ష్యసేన్, అశ్విని జోడీకి మాత్రం కఠిన డ్రా ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో పదో సీడ్‌గా బరిలోకి దిగనున్న సింధు గ్రూప్ క్రిస్టిన్ కూబా (ఎస్తోనియా), ఫాతిమత్ నబాహా (మాల్దీవ్స్)తో ఆడనుంది. ప్రిక్వార్టర్స్‌లో హె బింగ్ జియావో (చైనా), క్వార్టర్స్‌లో చెన్ యూ ఫీ (చైనా)ను ఎదుర్కొనే అవకాశముంది.