calender_icon.png 20 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక మానవాళి రక్షకుడు ఏసుప్రభు

20-04-2025 06:12:39 PM

సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఈ జాన్ బాబు.. 

హుజురాబాద్ (విజయక్రాంతి): లోక మానవాళి రక్షకుడు ఏసుప్రభు అని సిఎస్ఐ చర్చ్ పాస్టర్ జాన్ బాబు(CSI Church Pastor John Babu) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు(Easter celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పునరుత్థాన పండుగ అనగా ఏసు క్రీస్తు ప్రభువు శుక్రవారం సిలువ వేయబడి శనివారము, ఆదివారము తిరిగి సమాధిని గెలిచి లేస్తాడు మరణము గెలిచి లేస్తాడు అతనికి మరణము లేదు ఈ లోక రక్షణ కొరకు మానవాళి రక్షణ కొరకు లోక రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువు తిరిగి లేస్తాడు దానినే పునరుత్థాన పండుగ దీన్ని ఇంగ్లీషులో ఈస్టర్ పండుగ అంటారని సూచించారు.

కరీంనగర్ నుంచి పెద్ద గురువులు సదానందం గురువుల ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు పునరుత్తాన తిరిగి లేచినటువంటి బైబిల్ వాక్యములను పాటలతో స్తుతులతో ప్రార్థనలతో భక్తులు ఈ ఆరాధనలో అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సొల్లు బాబు, ట్రెజరర్ అమర్లపూడి ప్రియాంక, చరణ్, గూడెం రవీందర్, సొల్లు మహేందర్, వేముల పుష్పలత, వై రోహన్ సొల్లు శ్రీనివాస్, సొల్లు సునీతతో పాటు తదితరులు పాల్గొన్నారు.