21-04-2025 01:40:31 AM
ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్
ఎల్లారెడ్డి,ఏప్రిల్20 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గలో క్రైస్తవ సోదర సోదరీమణులకు ఆదివారం ఈస్టర్ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ చర్చిలకు వెళ్లి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలుతెలిపారు. ఈస్టర్ పండగ సందర్భంగా చర్చికి వెళ్లి ఫాదర్ చారి, హెప్సిబా లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం సొసైటీ వైస్ చైర్మన్, మత్తమాల ప్రశాంత గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సహకారం తో క్రైస్తవ సోదరీ సోదరులకు అనేక సేవలందిస్తున్నాడని అన్నారు. ఆదివారం ఆయన ఈస్టర్ పండుగ పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రతి చర్చికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు.
అనంతరం ఈ సందర్భంగా నియోజకవర్గం పాస్టర్లు చారి , హెప్సిబా మాట్లాడుతూ ఇప్పటివరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా క్రైస్తవులకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.క్రిస్టియన్లకు తోడ్పాటు అందించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావును ఆయన కుటుంబాన్ని జీసస్ ఎల్లవేళలా కాపాడాలని అన్నారు.
ఈస్టర్ పండగ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ తరపున సొసైటీ వైస్ చైర్మన్ మత్త మాల ప్రశాంత్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఆయన అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పాస్టర్లు,సంఘ సభ్యులకు అన్ని రకాల అండదండలు ఉంటాయని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బిట్ల సురేందర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.