calender_icon.png 21 April, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

20-04-2025 07:07:29 PM

మందమర్రి (విజయక్రాంతి): యేసు క్రీస్తు ప్రభువు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్‌ అని, క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు ఉద్బోధించారు. పట్టణంలోని అన్ని చర్చిలలో ఆదివారం ఈస్టర్‌ వేడుక(Easter celebrations)లను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సియస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఉదయం ఉమేన్స్ ప్రెసిడెంట్ సంధ్య జేర్మీయా, సెక్రెటరీ రీటా మధుసూదన్ ల ఆధ్వర్యంలో సిలువ వెలుగింపు కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం పాస్టర్ రెవరెండ్ జేర్మీయా ప్రత్యేక ఈస్టర్‌ ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు. శుభ శుక్రవారం రోజున శిలువ శ్రమను, శిలువ మరణమును అనుభవించి, మూడవ దినము ఆదివారంన పునరుత్థానము అయ్యారని అన్నారు. ఆయన తన రక్తముతో పాపాలను కడిగి క్షమాగుణాన్ని అందించారనీ ఆన్నారు. క్రీస్తు చూపిన మార్గములో శాంతి, సహనం, పరస్పర సహకార గుణాలతో అన్ని వర్గాలు జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పాల్గొన్నారు.