20-04-2025 06:17:04 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని బెగ్లూర్, రాపల్లికోట గ్రామాలలో యేసు ప్రేమించుచున్నాడు ప్రార్థనా మందిరాలలో జోసెఫ్, ప్రకాష్, సురేష్, పాస్టర్ల ఆధ్వర్యంలో ఈస్టర్, రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి కొరకు సిలువలో మరణించి, సమాధి చేయబడి మరణమును గెలిచి తిరిగి లేచడని వివరిస్తూ సందేశం అందించారు.
అనంతరం దేశ రాష్ట్ర ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థనలు చేశారు. ఈ సంద్భంగా రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ కార్యక్రమంలో జయహో జయహో యేసు లేచెను జయహో రన్ ఫర్ జీసస్ నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెగ్లూర్, రాపల్లికొట గ్రామ సంఘ పెద్దలు, పలు గ్రామాల విశ్వాసులు, జీసస్ లవ్స్ ప్రేయర్ టీం సభ్యులు పాల్గొన్నారు.