20-04-2025 01:02:56 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కేసముద్రం పట్టణంలోని క్రీస్తు విజయం సహవాసం చర్చ్ లో పాస్టర్ ఏసుక్రీస్తు పునరుద్దాన దినమును గురించి వివరించారు. ఏసుక్రీస్తు అన్ని కుట్రలను దుర్మార్గాలను దౌర్జన్యాలను పటాపంచలు చేసి మానవ మనుగడ కోసం మరణించి తిరిగి మూడో దినమున మరణము జయించి సమాధిని గెలిచి, దీనులకు పాపులకు నిరాశ్రయులకు నవోదయాన్ని ఇచ్చిన దినంగా ఆదివారం ఈస్టర్ పండుగ జరుపుకుంటారని తెలిపారు. క్రైస్తవులు యేసును కీర్తిస్తూ గీతాలాపనలతో ప్రార్థనలు నిర్వహించారు.