calender_icon.png 20 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులానగర్ ఆర్ సిఎం చర్చిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

20-04-2025 05:42:34 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ ఆర్ సిఎం చర్చిలో ఫాదర్ మార్నేని అర్లయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ఈస్టర్ వేడుకలు(Easter celebrations) నిర్వహించారు. దేవాలయంలో ఫాదర్ మార్నేని అర్లయ్య ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ నేడు ఏసు క్రీస్తు సమాధి నుంచి సజీవుడై పునరుత్థానం చెందిన దినం అని, హింస ద్వేషాలు మరణాన్ని ఇస్తాయి, ప్రేమా, క్షమాపణలు జీవితానికి నూతనత్వాన్ని ఇస్తాయని, ఇది నిరూపించడానికె సమాధి నుంచి సజీవుడై తిరిగి వచ్చాడు క్రీస్తు అని అన్నారు. అనంతరం చర్చిలో కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగిస్తూ భక్తులు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈస్టర్ ఫుడ్ స్వీకరించారు. కార్యక్రమంలో చర్చి యూత్ కర్లపూడి సామ్యేల్, చింతమల్ల వీరస్వామి, అంతోటి రాకేష్, వల్లాల రవీందర్, దామర్ల శశి, మెట్టు రాజేష్, బల్లెం థామస్, గండమల్ల విజయరాజు తదితరులు పాల్గొన్నారు.