calender_icon.png 24 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు

08-09-2024 01:09:26 PM

హైదరాబాద్: అల్పపీడనం క్రమంగా ఉత్తరం వైపుకు మారడంతో రాబోయే 48 గంటలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అల్పపీడనం క్రమంగా ఉత్తరం వైపుగా మారుతోంది. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భోంగీర్, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట,నాగర్ కర్నూల్, మహాబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్నటితో పోలిస్తే ఖమ్మం, మహబూబూబాద్‌లో వర్షాలు తగ్గుతాయని తెలంగాణ వెదర్‌మన్ తెలిపారు. హైదరాబాద్‌లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అటు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.