* హెచ్1బీ నిబంధనలు సులభతరం చేసిన అమెరికా
* యూఎస్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు ఎంతో మేలు
* జనవరి 17నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. భారతీయ విద్యార్థులు అమెరికా విమానం ఎక్కేందుకు అవసరం అయిన హెచ్ వీసాకు సం బంధించిన నిబంధనలను మరింత సులభతరం చేస్తూ బైడెన్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) హెచ్ వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు ల ద్వారా అమెరికాలోని కంపెనీలు మరింత సులభంగా ఖాళీలను వేరే దేశాలకు చెందిన వ్యక్తులతో భర్తీ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. కొత్త నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. నిపుణులైన వారిని ఎటువంటి ఆటంకాలు లేకుండా నియమించుకునేందుకు ఈ నిబంధనలు కంపెనీలకు సహకరిస్తాయి.
భారతీయులకు ఎంతో మేలు..
బైడెన్ సర్కారు సవరించిన వీసా నిబంధనల వల్ల భారతీయ విద్యార్థులకు అధికం గా ప్రయోజనం కలగనుంది. అగ్రరాజ్యం వెళ్లి చదువుకోవాలని కలలు కనే విద్యార్థుల కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. ఇటీవలి కాలంలో హెచ్ వీసాల్లో భారతీ యులే అగ్రభాగం దక్కించుకుంటున్నారు. ఎఫ్‌ౠ వీసా ద్వారా అగ్రరాజ్యం చేరుకోవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు కూడా ఈ సడలింపు ప్రయోజనం చేకూర్చనుంది. అమెరికాలో ఉన్న కంపెనీలకు కార్మి కుల కొరతను తీర్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అందుకోసమే ఈ మార్పు..
అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల కొరతను తీర్చేందుకు వీసా నిబంధనలు సవరించినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. ‘అమెరికాలో ఉన్న కంపెనీలు హై టాలెంట్, స్కిల్స్ ఉన్న వ్యక్తులు ఏ దేశం వారైనా వారిని నియమించుకునేందుకు ఈ నిబంధనలు సహకరి స్తాయి. అన్ని దేశాల వారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిబంధనల సడ లింపు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్డ్ పీపుల్‌ను తమ కంపెనీల్లో చేర్చుకోవచ్చు’ అని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మయోర్కాస్ అన్నారు.
హెచ్ ప్రోగ్రాంను అమెరికా కాంగ్రెస్ 1990లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటికేడు ఈ వీసాలను జారీ చేస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన యాజమాన్యాలు వివిధ దేశాల్లో ఉన్న ప్రతిభావంతులైన ఉద్యోగులను ఈ వీసాల ద్వారా నియమించు కోవచ్చు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జడ్డూ మాట్లాడు తూ.. ‘కాలానుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం ఉండేలా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది’ అన్నారు.
మనోళ్లే 72.3 శాతం
* అగ్రరాజ్యంలో ఉన్నత విద్య అభ్యసించాలని అనుకునే వారు ఎవరై నా సరే మొదట స్టూడెంట్ వీసా (ఎఫ్1 వీసా) మీద అక్కడికి చేరుకుంటారు. అనంతరం చదువు పూర్తయిన తర్వాత ఆ వీసాను హెచ్ మార్చుకుని అక్కడే ఉద్యోగంలో చేరాలని అనుకుంటారు. 2023లో అమెరికాలో హెచ్ వీసా పొందిన వారిలో భారతీయులే 72.3శాతం ఉన్నారు.
* ఎఫ్ 1 వీసాను హెచ్ మార్చుకునేందుకు ప్రస్తుతం అనేక అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటిని సరళతరం చేస్తూ బైడెన్ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.
* ఈ నిబంధనల సవరణ వల్ల వివిధ దేశాల విద్యార్థుల కంటే భారత విద్యార్థులకే అధికంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.