22-12-2024 01:42:15 AM
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ముండ్లమూరు మండలకేంద్రంతోపాటు శంకరాపురం, పోలవరం, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి స్వల్పంగా కంపించగా.. ముండ్లమూరు పాఠశాలలోని విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు మండలకేంద్రంతోపాటు గంగవరం, రామభద్రాపురం గ్రామాల్లోనూ రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.