అమరావతి,(విజయక్రాంతి): ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో సెకను పాటు భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు నమోదయాయి.ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి జనాలు బయటకు పరిగెత్తారు.