- కుప్పకూలిన భవనాలు.. ఒకరి మృతి
- పలువురికి గాయాలు
పోర్ట్‌విలా, డిసెంబర్ 17: ఫసిఫిక్ ద్వీప దేశాల్లో ఒకటైన వనౌటులో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 నమోదైంది. జియాలజిస్టులు రాజధాని పోర్ట్‌విలాకు పడమరన 57 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో పౌరు లు ఉలిక్కిపడ్డారు. కొన్నిచోట్ల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. రాజధానిలోని పలు దేశాల రాయబార కార్యాలయాలకు పగుళ్లు వచ్చాయి. దీంతో ఎంబసీలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. వనౌటు పసిఫిక్ మహాసముద్రంలోని 80 చిన్న దీవుల సముదాయం. ఇక్కడి జనాభా కేవలం 3.30 లక్షలు. వనౌటు రింగ్ ఆఫ్ ఫైర్‌జోన్‌లో ఉండడంతో తరచూ ఇక్కడ భూకంపాలు వస్తాయి.