calender_icon.png 5 April, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం

05-04-2025 12:42:04 AM

  1. సోలాపూర్‌లో రిక్టర్ స్కేలుపై 2.6
  2. వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: నేపాల్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో ఈ కంపనాలు నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఢిల్లీ ప్రాంతంలో కూడా ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్ కాలమానం ప్రకా రం రాత్రి 7.52కు భూకంపం సంభవించినట్టు,20 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం సంభవించిన మరుసటి రోజే నేపాల్‌లో భూకంపం వచ్చింది. మయన్మార్ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 3,085కు చేరుకుందని అక్కడి మిలటరీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే మయన్మార్ భూకంపం ధాటికి ప్రపంచం అతలాకుతలం అవగా.. తాజాగా నేపాల్‌లో కూడా భూకంపం సంభవించడం గమనార్హం. గుర్ఖాకోట్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టు సమాచారం. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.