calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌లో కంపించిన భూమి

03-04-2025 01:19:52 AM

రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో ప్రకంపనలు

టోక్యో, ఏప్రిల్ 2: జపాన్‌లోని క్యూషు పట్టణంలో బుధవారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 6.0 గా దీని తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు పౌరులెవరూ మృతి చెందినట్లు, గాయపడినట్లు అధికారులు ప్రకటించలేదు. ‘భూకంపం సంభవిస్తే జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.81 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మేర నష్టపోతుంది.

భారీ భూకంపం సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంది. భూకంపం వల్ల భీకర సునామీలు రావొచ్చు. 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంది.