29-03-2025 01:08:17 AM
తృటిలో తప్పించుకున్న నలుగురు కుటుంబ సభ్యులు
రామగుండం,(విజయక్రాంతి): థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో ఓ ఫంక్షన్ కు హజరు కావటానికి వెళ్లిన రామగుండం ఎమ్మేల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలీ ఠాకూర్ కూతురు, చిన్న కుమారుడు, ఆల్లుడు గురువారం వెళ్ళారు. వీరు ఓ హోటాల్ లో 35 వ ఆంతస్తులో బస చేయగా దూరదృష్టవశాత్తు శుక్రవారం మద్యాహ్నం అకస్మాత్తుగా భారీ భూ కంపం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున బిల్డింగ్ లు కుప్పకూలాయి. ఐతే వీరు బస చేసిన హోటేల్ బిల్డింగ్ కు మాత్రం పాక్షికంగా భూకంప తాకిడి తాకింది. ఎమ్మేల్యే మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాధం జరుగక పోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వారు ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. హైదరాబాదు నుంచి రామగుండం వస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు.