13-04-2025 12:47:50 AM
*పాక్‌లో 5.8, పపువాలో 6.2 తీవ్రతతో కంపించిన భూమి
*తప్పిన ప్రాణనష్టం
* కశ్మీర్‌లోనూ ప్రకంపనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పాకిస్థాన్, పపువా న్యూగినియా దేశాల్లో శనివారం భూకంపాలు సంభవించాయి. పాకిస్థాన్‌లో మధ్యా హ్న సమయంలో 5.8 తీవ్రతతో, పపువా న్యూ గినియాలో 6.2 తీవ్రతతో భూకంపా లు సంభవించాయి. ఏ దేశంలో కూడా ప్రా ణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
పపువా న్యూగినియాలోని తీరప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. కొకొపో పట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రకృతి విపత్తు కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇక పాక్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింనట్టు, భూకంపకేంద్రాన్ని పంజాబ్ ప్రావిన్సులోని అటాక్ జిల్లాలో గుర్తించినట్టు నేషనల్ సెంట ర్ ఫర్ సెసిమోలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. ఈ భూకంపకేంద్రం లోతు పది కిలోమీటర్ల మేర ఉన్నట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.
కశ్మీర్‌లోనూ ప్రకంపనలు
పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో భూకంపం రావడంతో ఆ ప్రభావం జమ్మూకశ్మీర్‌లో కూడా కనిపించింది. జమ్మూ, శ్రీనగర్, సోఫియాన్ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభ వించాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.