calender_icon.png 20 April, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్ఘనిస్థాన్ తజికిస్తాన్ సరిహద్దుల్లో భూకంపం

20-04-2025 12:04:42 AM

రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు..

86 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం...

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం భూమి కంపించింది. కశ్మీర్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 86 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది.