ఆదిలాబాద్, (విజయక్రాంతి): పర్యావరణాన్ని కాపాడడంతో పాటు పూజకు శ్రేష్టమైన మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రతి సంవత్సరం మాదిరిగానే తమ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వినాయక చవితి రోజున ఉదయం 8 గంటలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వినాయక మండపాల యువకులు సైతం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి గెడం మాధవ్, సభ్యులు రవీందర్, మదస్తూ సంతోష్, ఉపలంచివార్ కృష్ణ, దుర్వా సురేష్, ప్రకాష్ రాథోడ్, దిలీప్, తదితరులు ఉన్నారు.