calender_icon.png 25 September, 2024 | 6:04 PM

భూమికీ శని లాంటి వలయాలు

20-09-2024 02:06:41 AM

46 కోట్ల ఏళ్ల కింద భూమి చుట్టూ కోట్లాది గ్రహశకలాలు

తాజా అధ్యయనంలో వెల్లడైన సంచలన అంశాలు

వీటి ద్వారానే భూమిలోకి నీరు వచ్చిందనే అంచనా 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మన సౌర కుటు ంబంలో సుందరంగా కనిపించేది శనిగ్రహం. అందుకు కారణం దాని చుట్టూ తిరిగే రింగ్స్. అయితే, 46.6 కోట ఏళ్ల క్రితం ఇలాంటి రింగ్స్ భూమి చుట్టూ తిరిగేవని, మన నీలి గ్రహానికీ వృత్తాకార వ్యవస్థ ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయనం ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. భూమి పుట్టుకపై ఉన్న ఊహాగానా లు, అంచనాలను తలకిందులు చేస్తోంది. ఆర్దోవిషియన్ ఇంపాక్ట్ స్పైక్ అంతరిక్ష పేలు ళ్లు అనే సిద్ధాంతాన్ని వెలుగులోకి తెస్తోంది. 

భూమిపైకి నీరు

ఆర్దోవిషియన్ కాలం నుంచి 21 గ్రహశకలాలను మోనాశ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండీ టామ్కిన్స్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరంగా భూమి ఖండాంతర క్రస్ట్‌లో 70 శాతా నికిపైగా వెలుపల ఉన్నప్పటికీ ఈ ఆస్టరాయిడ్స్‌లోని క్రేటర్లన్నీ భూమధ్యరేఖకు 30 డిగ్రీల లోపల ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం.. ఓ పెద్ద గ్రహశకలం భూమి గరిష్ఠ కక్ష పరిమితికి దగ్గరగా వచ్చిందని, ఆటుపోట్ల కారణంగా అది విచ్ఛిన్నమై భూమి చుట్టూ వలయాన్ని ఏర్పరచి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. అనంతరం కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత ఈ శకలాలన్నీ భూమిపైకి పడిపోయినట్లు చెబుతున్నారు. భూమిపై ఉల్కల ప్రభావంతోనే నీరు ఉద్భవించిందనే ఓ సిద్ధాంతం ఉంది. ఇందుకు ఈ గ్రహశకలమే కారణమని అధ్యయనకారులు చెబుతున్నారు.