calender_icon.png 1 October, 2024 | 4:41 PM

మూగజీవాల ప్రాణాలతో కోట్ల కొలది సంపా"ధన"

01-10-2024 01:44:51 PM

జగిత్యాల,(విజయక్రాంతి): మూగజీవాల ప్రాణాలు ఫణంగా పెట్టి చట్టం విరుద్ధoగా కొనసాగిస్తున్న దందాకు కోట్ల కొలది సంపా"ధన" కోసం కొందరు "మేక రాళ్ల" వ్యాపారాన్ని ఎంచుకున్నారు. జగిత్యాల జిల్లాలో గత కొన్నేళ్లుగా మేక రాళ్ల వ్యాపారంతో కొందరు కోట్లకు పడగలెత్తారు. మూగ జీవాలైన మేకల కడుపుల్లో కొందరు ఔషధాలు ఉత్పత్తిని రహస్యంగా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యాపారం కొనసాగుతుంది. ఔషధ ఉత్పత్తికి ఫార్ముల లేక పోగా  ప్రక్రియ ప్రయోగశాలల్లో చేయడం కుండా పరిశోధన రంగాలలో అనుభవం ఉన్న సైంటిస్టు (పరిశోధనపరులు) ఈ ఫార్ములాను కనుగొలేక పోతున్నారు.

ఈ దందా మేకల కాపరు చేస్తున్నారా? ఎవరైనా వ్యాపారులు చేయిస్తున్నారా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ మేకల కడుపులో ఉత్పత్తి అయినా ఔషధం మేక ల ప్రాణాలు తీసి మేక రాళ్లను బయటకు తీస్తున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యానికి, మందు లల్లో వినియోగిస్తారు. తులం కు రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ధర పలుకుతుంది. పక్కా ప్రణాళికతో మేకల తినే ఆహారంలో ఆకులు, అలముల మొక్కలను మేకలకు మేతకు అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి మేపుతూ మేకల కడుపుల్లో రాళ్ళను పెంచుతారు. మేకలు కడుపులో రాళ్ళు ఉత్పత్తి చేసే ఆకులు జగిత్యాల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోనే లభ్యమౌ తుంది.

మేక రాళ్లకు ఎనలేని డిమాండ్

మేకల వధించి శరీరం నుంచి తీసే రాళ్లకు భలే డిమాండ్ ఉంది. ఆయుర్వేద ఔషధాల తయారీకి  ముంబై, హాంకాంగ్, థాయిలాండ్ దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో,  మహారాష్ట్రలోని నాందేడ్ కేంద్రాలుగా ఈ రాళ్ల వ్యాపారం జరుగుతుందన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, రాయికల్, మేడిపల్లి, కొడిమ్యాల్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, సారంగాపూర్ అటవీ ప్రాంతాల్లోని మేకల కడుపుల్లో రాళ్లు పెరిగే మొక్కలు, ఆకులు ఉన్నాయి. నెలలపాటు గుట్టపై గుడారాల్లాంటి స్థావరాలు ఏర్పాటు చేసుకొని మేకలను మేతకు తీసుకెళ్తుంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని నెలల పాటు మేకలను గుట్టలాపై నుండి కిందకి రానివ్వరు. ఈ మేకలను  ఇక్కడ మేపినందుకుగానూ ఆయా గ్రామ పంచాయితీలకు అనధికారికంగా రూ.50 వేల నుండి ఒక లక్ష వరకు దక్షిణ చెల్లిస్తుంటారు. ఈ డబ్బులు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంటారు.

మేకల కడుపులో రాళ్ల ఉత్పత్తి 

కిడ్నీ, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడి మనుషులు అనారోగ్య బారిన పడిన సందర్భాల్లో మందులతో పాటు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువ మోతాదు లో ఉండాలి, అంటూ వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారు. మేక కడుపులో రాళ్లు ఉత్పత్తి కోసం మేకల జీర్ణాశయాలలో రాళ్లు పెరగడానికి ప్రత్యేకంగా ఓ తరహా మేతను మేపుతారు. మేకలు అన్ని రకాల చెట్ల ఆకులు తింటాయి. సీతాఫలం చెట్టు ఆకు మినహా రాళ్ల ఉత్పత్తికి  ‘కోడిసె ఆకులు’  జిట్టి రేణి పండ్ల ముళ్ళకంప చెట్టు ఆకులను ‘ పోతప్ప ఆకు మూడు నాలుగు నెలల పాటు వీటిని మేకలు తింటే వాటి పెద్ద పేగులో (జీర్ణశం) సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు రాళ్లు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కొన్ని నెలల పాటు మేకలను గుట్ట కిందకి దిగనివ్వరు. మేకలు వీటితో పాటు ఇతర ఆకులు తింటే వాటి జీర్ణాశయంలో రాళ్లు పెరగవటా, పెరిగిన రాళ్లు వాటి మలవిసర్జనల్లో పోతాయటా..!అందుకే అన్ని జాగ్రత్తలను వాళ్ళు తీసుకుంటారటా.. పితృపక్షాలు, దసరా ఉత్సవాలు మహాలయాల అమావాస్య. రోజులలో మేకల మాంసం విక్రయిస్తుంటారు. ఈ రోజుల్లో మాంసానికి డిమాండ్ ఉంటుంది.

మాంసం విషతుల్యం…

విషతుల్యమైన చెట్ల ఆకులను రాళ్ల కోసం మేకలకు మేత తినిపించడంతో జీర్ణాశయంలో రాళ్లు ఉత్పత్తి అవుతున్న మేకలు బలహీన పడి నడవ లేని స్థితికి చేరుకుంటాయటా.. అవి సహజంగా మృతి చెందిన సందర్భాల్లో దుర్గంధo, దుర్వాసన వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.  మేకను రాళ్ల కోసం  చంపిన వాటి మాంసం తినడానికి అధిక శాతం తిరస్కరిస్తారని చెబుతున్నారు. మేక రాళ్ల  వ్యాపారంలో పోటీతోనో, గ్రామాలలో రాజకీయ పార్టీల ఆధిపత్యపు పోరుతోనో కానీ అడవులలో మేకలు ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది గుట్ట చుట్టూ ముట్టారు. తమ అనుమతి లేకుండా అడవిలో మేకలు ఎలా మేస్తాయని, కేసులు నమోదు చేస్తామని బెరిస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని మేకల కాపర్ల పక్షాన అటవీ శాఖ అధికారుల తో మాట్లాడి ఎంతోకొంత దక్షిణ చెల్లిస్తుంటారు. వ్యాపారంలో  నెలకొన్న పోటీతో పరస్పరంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారో తెలియదు కానీ ఈ ప్రాంతానికి మేకల సంఖ్య రావడం మాత్రం తగ్గిపోయితుంది. మనిషి తన కిడ్నీ, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడితే ఎంత నరకయాతన అనుభవిస్తాడో తెలియదు కానీ, తమ వ్యాపారం కోసం నోరులేని మూగజీవాల జీర్ణాశయాలలో  రాళ్లను ఉత్పత్తి చేస్తున్న క్రమంలో  అమాయకపు  జీవాలను నరకయాతనకు గురి చేస్తుండటం గమనార్హం.