calender_icon.png 21 October, 2024 | 3:59 PM

చితాభస్మంతో సంపాదన

21-10-2024 12:00:00 AM

రూ.400 కోట్లు ఆర్జించిన జపాన్

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: బతికి ఉన్నంత వరకే మానవ దేహానికి విలువ అని అందరూ అంటూంటారు. కానీ ఆ నమ్మకాన్ని తప్పు చేస్తూ జపాన్ ప్రభుత్వం చనిపోయిన మనుషులను కాల్చడం ద్వారా వచ్చే చితాభస్మం నుంచి రూ.400 కోట్లు ఆర్జించింది. సాధారణంగా మన దేశంలో కుటుంబ సభ్యులు చనిపోతే చితాభస్మాన్ని జాగ్రత్తగా భద్రపరిచి, పవిత్ర నదుల్లో కలుపుతారు.

జపాన్‌లోని పబ్లిక్ శ్మశాన వాటికల్లోనూ కొన్నేండ్ల క్రితం ఇదే సంప్రదాయాన్ని పాటించేవారు. కాగా చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడే పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని అక్కడి ప్రభుత్వం గుర్తించింది.

దాంతో ఐదేళ్లలో అక్కడ చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలను సేకరించి విక్రయించింది. తద్వారా దాదాపు రూ.400 కోట్లను ఆర్జించారు. ఈ డబ్బును బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల నిర్వహణకోసం వినియోగిస్తున్నారు.