29-03-2025 05:44:05 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): నగరంలోని స్థానిక కట్టారాంపూర్ 11వ డివిజన్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో శనివారం రోజున ముందస్తు ఉగాది పండుగ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ దంపతులు శ్రీమతి శ్రీ గున్నాల అర్చన క్రాంతి కుమార్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం అందరూ కలిసి షడ్రుచులతో తయారుచేసిన ఉగాది పచ్చడి విద్యార్థులందరికీ పంచడం జరిగింది. తర్వాత పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందం అందరికీ శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.