28-03-2025 06:49:32 PM
కాటారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లోని అయ్యప్ప దేవాలయం కాలనీ లో శుక్రవారం ముందస్తు ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అయ్యప్ప వాడలో మహిళలు అందరూ కలిసి ముందస్తుగా ఉగాది పండుగ వేడుకను నిర్వహించుకున్నారు. అందరూ సేకరించిన సామాగ్రిని పడకంటి అంజలి ఇంటి వద్ద నుండి శ్రీ హర్షిత డిగ్రీ కాలేజ్ వరకు తీసుకు వెళ్ళారు. కాలేజీలో షడ్రుచులలో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసారు. మహిళలంతా భక్తి శ్రద్ధలతో పాటలు పాడి పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడి, భక్ష్యాలను అందరూ స్వీకరించారు. కాలనీలోని పలువురికి ఉగాది పచ్చడిని, భక్ష్యాలను పంచారు. ఒకరికి ఒకరు ఉగాది శుభకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన పడకంటి అంజలికి పలువురు అభినందనలు తెలిపారు.