కరీంనగర్ సిటీ, జనవరి 10: కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లి లో గల సెయింట్ పాల్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగవల్ల పోటీలు నిర్వహించడం పాటు గాలిపటాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.