calender_icon.png 11 January, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

10-01-2025 10:40:10 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. రాజా రమేష్ భోగి మంటలను వెలిగించి ఉత్సవాలను ప్రారంబించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. భోగి, సంక్రాంతి పండగ యొక్క విశిష్టతను వివరించారు. విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణతో వచ్చి, గాలి పటాలను ఎగురవేసి ఆనందంలో నిమగ్నమైపోయారు. విద్యార్థిని, విద్యార్థులకు రంగోలి (ముగ్గుల) పోటీలను నిర్వహించి, బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈ.రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ యం. రాజా రమేష్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.