13-03-2025 11:11:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వశిష్టా టెక్నో స్కూల్లో గురువారం ముందస్తు హోలీ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు సహజసిద్ధమైన రంగులను తయారుచేసి ఒకరిపై ఒకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు మాధవి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలో, పట్టణంలోని వివిధ పాఠశాలలో పోలి సంబరాలను జరుపుకున్నారు. విజయ స్కూల్, బచ్పన్ సంస్కార్ ప్లే స్కూల్, భాష్యం స్కూల్ తదితర పాఠశాలలో చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు హోలీ పండుగ సంప్రదాయాలను వివరించారు మోహన్ రెడ్డి మంచిర్యాల నాగభూషణం విజయలక్ష్మి అయ్యన్న గారి రచన శ్రీధర్ తదితరులున్నారు.