calender_icon.png 13 March, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మనపల్లి పాఠశాలలో ముందస్తు హోలీ సంబురాలు

13-03-2025 06:57:42 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్  ప్రాధమిక పాఠశాలలో ముందస్తు హోలీ సంబురాలు గురువారం నిర్వహించారు. విద్యార్థులు, టీచర్స్ఈ సంబురాల్లో పాల్గొని సంప్రదాయ రీతిలో పసుపు, కుంకుమలతో ఎలాంటి కెమికల్ ప్రభావం లేకుండా ఈ ముందస్తు హోలీ పండుగ జరుపుకున్నారు. హోలీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఇళ్ల దగ్గర అన్ని జాగ్రత్తల తో హోలీ జరుపుకోవాలని సూచించారు. ప్రధానోపాథ్యాయురాలు ఎం. జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్స్ జర్పల పద్మ, నీరజా షారోన్, ఎండీమ్ కుక్ సరోజ లు పాల్గొన్నారు.